Virat Kohli Breaks Sachin Tendulkar Record: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. వైట్‌బాల్ క్రికెట్ ఐసీసీ ఈవెంట్లలో విరాట్ ఇప్పటివరకు 2740కి పైగా రన్స్ చేశాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో సచిన్ 2719 రన్స్ చేశాడు.
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2422) మూడో స్థానంలో ఉన్నాడు. మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (1707), మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (1671), మాజీ సారథి ఎంఎస్ ధోనీ (1492) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ గణాంకాలు ఐసీసీ వన్డే ప్రపంచకప్, ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో చేసినవి. సచిన్ భారత్ తరఫున 6 వన్డే ప్రపంచకప్‌లు ఆడగా.. విరాట్ ప్రస్తుతం నాలుగో ప్రపంచకప్ ఆడుతున్నాడు. కోహ్లీ 5 టీ20 ప్రపంచకప్‌లు సహా మూడు చాంపియన్ ట్రోఫీలు కూడా ఆడాడు.
Also Read: Mitchell Starc: ప్రపంచకప్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా మిచెల్ స్టార్క్!
ఈ మ్యాచులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. డేవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్స్ తీయగా.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఈజీగా ఛేదిస్తుందనుకున్నా.. ఆసీస్ పేసర్ల ధాటికి టాప్ ఆర్డర్ వరుసగా పెవిలియన్ చేరింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో టీమిండియాను ఆదుకున్నారు. విరాట్ (85) ఔట్ అయినా రాహుల్, పాండ్యా క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా భారత్ 64 బంతుల్లో 27 రన్స్ చేయాలి.
End of a magnificent knock from Virat Kohli, who departs for 85 👏👏#TeamIndia 168/4, with 32 more runs to win.
Follow the Match ▶️ https://t.co/ToKaGif9ri#CWC23 | #INDvAUS | #MeninBlue pic.twitter.com/YL4J8DrI6Y
— BCCI (@BCCI) October 8, 2023