Mitchell Starc breaks Lasit Malinga’s OCI World Cup Wickets record: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన స్టార్క్.. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్స్ మార్క్‌ను అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ రికార్డు నెలకొల్పాడు. స్టార్క్ కేవలం 941 బంతుల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ పేరిట ఉండేది. మలింగ 1187 బంతుల్లో 50 వికెట్లు పడగొట్టాడు. తాజాగా మలింగ రికార్డును స్టార్క్ బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున 112 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్.. 221 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ హాల్ 9 సార్లు ఉన్నాయి.
Also Read: Bhagavanth Kesari Trailer: సప్పుడ్ సెయ్యక్.. పిల్ల మొగ్గ! బాలయ్యబాబు అభిమానులకు పూనకాలే
ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆలౌట్ అయింది. డేవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్స్ తీయగా.. కుల్దీప్ యాదవ్ 2, ఆర్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఈజీగా ఛేదిస్తుందనుకున్నా.. ఆసీస్ పేసర్ల ధాటికి కుదేలైంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో భారత్ కోలుకుంది. భారత్ ఇంకా 84 బంతుల్లో 41 రన్స్ చేయాలి.