విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై జరిగిన అత్యాచారం ఘటన బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐదు నెలల పాపపై 40 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆరేళ్ల చిన్నారిపై ఆగంతకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతరలో చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వివాహితకు భర్త శిరోమండనం చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చిత్ర హింసలు ఆమెకు గుండు గీసి పరారయ్యాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసిన కర్రి అభిరామ్, ఆశలు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
మహిళపట్ల జరిగే అఘాయిత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. కానీ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొంత మంది మగాళ్లు మృగాళ్లుగా మారి విరుచుకుపడుతున్నారు. ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని కిడ్నాప్ చేసి మరీ వాళ్ల కామవాంఛ తీర్చుకుంటున్నారు. మనుషులలాగా కాకుండా మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమ్ముడి వివాహేతర సంబంధం కారణంగానే అన్న హత్యకు గురైనట్లు తెలిసింది.
తిరుపతి చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి కారుపై పెట్రోల్ పోసి కారులో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజును దుండగులు తగలబెట్టారు.
అనుమానం పెను భూతమైంది.. అని చాలా సార్లు చదివే ఉంటాం. ఈ సంఘటనలోనూ ఆ అనుమానమే.. ఏడాదైనా నిండని పసి కందు పాలిట యమ పాశమైంది. భార్యపై పెంచుకున్న అనుమానమే... ఆ బాలుడి ఉసురు తీసింది.