పాయల్ రాజ్ పుత్.. ఈ భామ ఆర్‌ఎక్స్ 100′ చిత్రం తో ఓవర్ నైట్ పాపులర్ హీరోయిన్ అయింది..అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించడంతో పాటు.. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన ఇందు పాత్ర సెన్సేషన్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి.ఆర్ఎక్స్ 100 తరువాత ఈ భామ చాలా సినిమాలలో నటించింది. కానీ అవేమి కూడా పాయల్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించలేదు.. స్టార్ హీరో వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమా లో నటించిన కూడా పాయల్ కు అంతగా కలిసి రాలేదు. దీనితో ఇప్పుడు మరోసారి దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం లో నటిస్తోంది ఈ భామ .
పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన తాజా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా లో నందితా శ్వేత, అజయ్ ఘోష్ మరియు దివ్యా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలో పాయల్ చేసిన పాత్ర పై ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది…ఇందులో పాయల్ నింఫోమానియాక్ కండీషన్ వున్న పాత్రలో కనిపిస్తుందని సమాచారం.నింఫోమానియాక్ అంటే.. శృంగార కోరికలను అదుపు చేయలేని స్థితి అని తెలుస్తుంది.. ఈ పాత్ర ఎంతో బోల్డ్ గా వుంటుందని, కథ కు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో కొన్ని బోల్డ్ సీన్లు వున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత పాయల్- అజయ్ భూపతి కాంబోలో తెరకెక్కిన చిత్రం కావడం తో ‘మంగళవారం’ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి మంగళవారం సినిమా పాయల్ కు మరో బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో చూడాలి..