'మంకీపాక్స్' ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మధ్య మరియు తూర్పు ఆఫ్రికా నుండి మొదలైన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు భారతదేశానికి చేరువైంది. పాకిస్థాన్‌లో 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుండి వచ్చిన వ్యక్తిలో మొదటి కేసు కనుగొన్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది.…
Kerala Nipah Update: కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. బుధవారం మరో నిపా కేసు వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకు రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నిపా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిలో అధికంగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులో ఈ వైరస్ మనుషులకు మరింత సులభంగా సోకుతుందని UN ఏజెన్సీలు హెచ్చరించాయి. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని నిబంధనలను పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సూచించింది. బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు.