నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బీ, సీ సెంటర్స్ విజిల్స్ తో మోతమోగడం గ్యారెంటీ. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, అఖండ సినిమాలే అందుకు ఉదహరణ. బాలయ్య ఫ్యాక్షన్ జానర్ లో చేసిన సినిమా చేస్తే, సీడెడ్ లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఈ మాటని మరోసారి నిరూపించడానికి బాలయ్య సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించబోతున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో వీరా సింహా రెడ్డి సినిమా పర్ఫెక్ట్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ గా రూపొందింది. ఎంత గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిందో అంతే గ్రాండ్ గా ‘వీర సింహా రెడ్డి’ ప్రమోషన్స్ ని చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. జనవరి 12న తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం కన్నా ముందే, ఓవర్సీస్ లో రచ్చ చేస్తున్నాడు బాలయ్య.
బాలయ్య మార్క్ యాక్షన్ సినిమాలకి ఓవర్సీస్ లో ఒకప్పుడు మార్కెట్ చాలా తక్కువగా ఉండేది, లెజెండ్ సినిమా నుంచి బాలయ్య ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ మూవీ కూడా ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు ఇదే జోష్ లో ‘వీర సింహా రెడ్డి’ కూడా ఓవర్సీస్ లో రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ నార్త్ అమెరిక రైట్స్ ని ‘శ్లోక ఎంటర్టైన్మెంట్స్’ సొంతం చేసుకుంది. మంచి పబ్లిసిటీ చెయ్యడంలో దిట్ట అయిన శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ‘వీర సింహా రెడ్డి’ సినిమాని కూడా ప్రేక్షకుల్లోకి బాగానే తీసుకోని వెళ్లారు. జనవరి 11న వీర సింహా రెడ్డి ప్రిమియర్స్ పడనున్నాయి, మరో వారం రోజులు ఉండగానే ప్రీబుకింగ్స్ విషయంలో సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాల కన్నా వీర సింహా రెడ్డి మూవీ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటివరకూ ప్రీబుకింగ్స్ రూపంలో వీర సింహా రెడ్డి సినిమా 130K డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్ ఇంకా టైం ఉంది కాబట్టి వీర సింహా రెడ్డి ప్రీబుకింగ్స్ విషయంలో సీనియర్ హీరోలకి మంచి బెంచ్ మార్క్ నే సెట్ చేసేలా కనిపిస్తోంది.