సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే బ్యాక్ టు బ్యాక్ కథలు వింటూ నచ్చిన వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. రీసెంట్ గా ‘లవ్ టుడే’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ‘ప్రదీప్ రంగరాజన్’తో రజినీ ఒక సినిమా చేయ్యనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అన్నింటికన్నా రజినీ ఫాన్స్ ని ఎక్కువగా థ్రిల్ చేస్తున్న న్యూస్ ఏంటంటే… ‘సూపర్ స్టార్ట్-మూవీ మేకింగ్ మాస్టర్’ కలిసి సినిమా చెయ్యబోతున్నారు అనే మాటే. ఇటివలే లైకా ప్రొడక్షన్ హౌజ్ తో రెండు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇందులో ఒక సినిమాకి సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించనుండగా, ఇంకో సినిమాకి మణిరత్నం డైరెక్ట్ చేయనున్నాడని కోలివుడ్ వర్గాల సమాచారం. ‘రజినీకాంత్-మణిరత్నం’లది క్లాసిక్ కాంబినేషన్. దాదాపు 32 ఏళ్ల క్రితం మణిరత్నం, రజినీ కలయికలో దళపతి సినిమా వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించిన ఈ మూవీ ఇప్పటికీ ఒక సంచలనమే. మణిరత్నం మేకింగ్, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, ఇళయరాజా మ్యూజిక్, రజినీ మమ్ముట్టి శోభనల యాక్టింగ్ దళపతి సినిమాని చాలా స్పెషల్ గా మార్చాయి.
కర్ణుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన దళపతి సినిమా తర్వాత రజినీ మణిరత్నం కలిసి వర్క్ చెయ్యలేదు. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేస్తూ అతి త్వరలో ఈ మ్యాజికల్ కాంబో సెట్ అవనుందట. ఇప్పటికే మణిరత్నం చెప్పిన కథకు రజనీకాంత్ అంగీకరించారట. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో 500 కోట్లు రాబట్టి కోలివుడ్స్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మణిరత్నం, ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్-2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని రిలీజ్ చేసిన తర్వాత మణిరత్నం, రజినీకాంత్ సినిమా పనులు మొదలుపెట్టనున్నాడట. ఏప్రిల్ 14న తమిళ న్యూ ఇయర్(పుత్తాండు) రోజున మణిరత్నం-రజినీకాంత్ ప్రాజెక్ట్ విషయంలో లైకా ప్రొడక్షన్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తమిళ సినీ అభిమానులు అనుకుంటున్నారు.