వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రధానంగా ఈడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. అయితే.. రాష్ట్రంలోని ములుగు జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులలో 10 మంది విషజ్వరాలతో మృతి చెందడం కలకం రేపుతోంది.. జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఏజెన్సీలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారు.
Also Read : North Korea: రష్యా పర్యటనలో కిమ్.. క్షిపణుల ప్రయోగంలో నార్త్ కొరియా
రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక గణాంకాల ప్రకారం, నగరంలో గత నెలలో డెంగ్యూ కేసులు 10 రెట్లు పెరిగాయి, జూలైలో 164 నుండి ఆగస్టులో 1,171 కి చేరుకుంది.‘‘ఆగస్టు చివరి వరకు నమోదైన డెంగ్యూ కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్‌లో నమోదైంది. తెలంగాణలో 2,972 కేసులు నమోదయ్యాయి, వీటిలో ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో హైదరాబాద్‌లో 1,562 కేసులు నమోదయ్యాయి. చుట్టుపక్కల జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే, వాటా పెరుగుతుంది. దాదాపు 75 శాతం ఉంటుంది” అని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. డెంగ్యూ అనేది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి. హైదరాబాద్‌లో డెంగ్యూ వ్యాప్తికి ప్రధాన కారణం రోడ్లు, నిర్మాణంలో ఉన్న ప్రదేశాలు మరియు ఇతర ప్రదేశాలలో తరచుగా కురుస్తున్న వర్షాలకు కారణమని అధికారులు తెలిపారు.
Also Read : Pakistan: నేను అధికారంలో ఉంటే జీ20ని నిర్వహించే వాడ్ని.. నవాజ్ నీకు అంత సీనుందా..?