టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుసగా సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మొన్నీమధ్య వచ్చిన శాకుంతలం సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోక పోయిన కూడా నిన్న రిలీజ్ అయిన ఖుషి మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా తర్వాత ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది..
ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది… సమంత ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ తప్ప ఇతర ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. అయితే ఖుషి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయ్, సమంత రొమాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కొంత భాగం సాగదీతకు గురైందని, కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉన్నాయని అంటున్నప్పటికీ ఓవరాల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉందని చెబుతున్నారు..
ఒకవైపు సమంత, విజయ్ లిప్ లాక్ సీన్స్, మరోవైపు కాశ్మీర్ అందాలు జనాలకు బాగా నచ్చేసాయి.. దర్శకుడు శివ నిర్వాణం ఈ చిత్రాన్ని చక్కగా చిత్రీకరించారు. ఇదిలా ఉండగా సమంత యుఎస్ కి మయో సైటిస్ చికిత్స కోసం వెళ్లినట్లు ఉంది.. యుఎస్ టూర్ ముగించుకుని తాజాగా సమంత ఇండియా తిరిగి వచ్చింది. ఎయిర్ పోర్ట్ లో ఆమె దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాస్క్ ధరించిన సమంత ముఖాన్ని కవర్ చేసుకుంది. రెడ్ టాప్ ధరించి తన స్టన్నింగ్ స్ట్రక్చర్ ప్రదర్శిస్తూన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. చైతూతో విడిపోవడం, ఆ తర్వాత తలెత్తిన అనారోగ్య సమస్యలతో సామ్ సతమతమవుతోంది. కానీ సహనం కోల్పోకుండా తాను పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతోంది.. ఇక నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నారా అని సామ్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు..