Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా మనం బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడం కోసం ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు కాకుండా కొన్ని వేరే పానీయాలు తీసుకోవాలి.
Also Read: Pragya Jaiswal : జిమ్ లో చెమటలు చిందిస్తున్న బాలయ్య బ్యూటీ..
వాటిలో మొదటిది జీలకర్ర, సొంపుతో చేసిన పానీయం. దీని కోసం రెండు కప్పుల నీరు తీసుకొని దానిలో కొంత జీలకర్ర వేసి, కొంచెం సోంపు, కొంచెం వాము వేసి నీరు ఒక కప్పు వరకు తగ్గేంత వరకు కాచాలి. అనంతరం దానిని చల్లార్చి తాగితే జీర్ణక్రియ బలపడుతుంది. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు. సాధారణంగా గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయను వేసుకొని తాగినా బరువు తగ్గుతారు. దానికి దాల్చిన చెక్క పొడిని కలిపినా మంచి ప్రయోజనం ఉంటుంది. దీన్ని తాగితే శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు చనిపోయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవే కాకుండా చిటికెడు పసుపు, కూసంత మిరియాల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ పానీయం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దాని ద్వారా శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గిపోతుంది. ఈ కారణంగా కూడా బరువు తేలికగా తగ్గవచ్చు. ఇవి కాకుండా ఉదయాన్నే వేడి నీరు తీసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నిద్ర లేచిన వెంటనే వీటిలో ఏది తీసుకున్నా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే టీ, కాఫీలాంటి వాటిని మాత్రం ఉదయాన్నే తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ పానీయాలు తాగిన తరువాత టిఫిన్ తినవచ్చు. దాని తరువాత మాత్రమే టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది.