సిద్దిపేటలో 16వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు దోస్తీ దవాఖానాలుగా మారుతున్నాయన్నారు. ఇందిరమ్మ కాలనీ పేద ప్రజలకు సుస్తీ అయితే బస్తీ దవాఖాన నయం చేస్తుందని, బస్తీ దవాఖానలో 158రకాల మందులు ఇచ్చి, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. త్వరలోనే 137రకాల పరీక్షలు కూడా నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read : Womens T20 World Cup: విండీస్‌తో పోరుకు హర్మన్‌సేన రెడీ..మంధానా వచ్చేసింది!
ఇదిలా ఉంటే.. సిద్దిపేట రాముని పట్లవద్ద పెద్దకోడూర్ కి చెందిన ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రమాదంలో స్వల్ప గాయాలు కాగ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు తక్షణమే సిద్దిపేట వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, సిటీ స్కాన్ , ఎక్స్ రే తీసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడలన్నారు. పూర్తి స్థాయిలో కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని నేను ఉన్నాను.. అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Also Read : Sajjan Jindal: వైఎస్ లేని లోటు ఎవరూ పూడ్చలేరు.. సీఎం జగన్ నాయకత్వంపై ఇతర రాష్ట్రాల్లో చర్చ..