మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. “సేవాలాల్ జయంతి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ప్రకటించారు.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.. బంజారా భవన్ ఏర్పాటు చేశారు, తండాలను గ్రామపంచాతీలుగా ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాటు.. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ, యువతులకు స్కూటీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీలు సగం.. సగం.. ఆగం ఆగం.. అయ్యాయి.. దేవుళ్ళను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడం పెద్ద విషయం కాదని అన్నారు.
Also Read:Hyderabad: హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం
పాలమూరు బిడ్డ, నల్లమల బిడ్డ అనే రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు చేయలేదు.. రైతు బంధు వర్ష కాలంలో 8 వేల కోట్లు, యాసంగిలో 4 వేల కోట్లను ప్రజలకు ఎగ్గొట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి.. కరోనా సమయంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు.. రేవంత్ రెడ్డి కుటుంబ ఆదాయమే ముఖ్యం.. అయితే లూటీ లేకుంటే లాఠీ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరున వేల ఎకరాల భూమిని లాక్కుంటున్నారు.. 16 నెలల అవుతున్న పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు.. కేసీఆర్ కిట్టు, రమజాన్ టోఫా, రైతు బంధు, ఫీజు రీయింబర్స్ మెంట్ లు బంద్ చేశారని మండిపడ్డారు.
Also Read:Australia: స్టేజ్ పైనుంచి కింద పడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ
గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. HCU, ప్రభుత్వ భూములు అమ్ముకోవడమే రేవంత్ రెడ్డి పని.. 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపిన రేవంత్ రెడ్డి.. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ మోసం చేశారు.. దమ్ముంటే గన్మెన్లు, పోలీసులు లేకుండా బోయిన్ గుట్ట తండాకురా…రుణమాఫీ అయిందా లేదా చెబుతారు అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.