హైదరాబాద్‌లో పట్టపగలు మేఘాలు కమ్ముకున్నాయి. నగరమంతా చీకటి అలుముకుంది. ఇక నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఉరుములు, గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇంకోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి, సచివాలయం, ఆబిడ్స్, నాంపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.