తెలంగాణలో గొల్లలు, కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారని.. కానీ గొల్లలు, కుర్మలు ఒక్కటే అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గొల్ల, కుర్మల తరుపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. గొల్ల, కుర్మలు లేకుండా ఇప్పటి వరకు కేబినెట్ లేదని.. ఈసారి కూడా మంత్రి వర్గంలో గొల్ల, కుర్మలకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాం అని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య…
పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
Beerla Ilaiah: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గురించి అవాక్కులు, చావాక్కులు మాట్లాడటం తగదన్నారు. అంతే కాకుండా అయన మాట్లాడుతూ.. కేటీఆర్ తన నోరును అదుపులో పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రులు అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాగు,…
Beerla Ilaiah : ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు…
Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య అన్నారు. నిన్న గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారు.. తెలంగాణ ప్రజానీకం గమైస్తున్నది.. మీరు ప్రజా ప్రతినిధుల లెక్క వ్యవహరిస్తలేరు పందికొక్కుల్లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడని విమర్శించారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. తెలంగాణ ప్రజలు ఏం అనుకుంటారో అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను ఏటీఎం లాగ వాడుకుని లూటీ చేసి.. ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలోనైనా.. కేటీఆర్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు.
ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో.. నెట్టింట ఫోటోలు వైరల్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారానే విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు.…
తెలంగాణలో ప్రజా పాలనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నిత్యం అప్పులను ఎలా తీర్చాలి.. నిధులు ఎలా తెచ్చుకోవాలి అని సీఎం ప్రయత్నం చేస్తుంటే.. కేటీఆర్ ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ వెళ్లిండు అని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా..? రాష్ట్రంకి కావాల్సిన అవసరాల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. కేటీఆర్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరిగిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ ఏ రైతు అప్పుల పాలు కావద్దని భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ వరంగల్ డెకరేషన్ లో చెప్పిండన్నారు. మంత్రివర్గమంతా దృఢ సంకల్పం నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాటను శిలాశాసనంగా భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ…