కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ ట్రై యాంగిల్ సూసైడ్ కేసు గురించి ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్య కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవని అన్నారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. నిఖిల్‌కు ప్రాణహాని ఉన్నట్లు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని ఎస్పీ తెలిపారు. ఆ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాం.. పోస్టుమార్టం ప్రైమరీ రిపోర్ట్ వచ్చిందని ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు.
Read Also: Kejriwal: ఎన్నికల ముందు మరో వరాల జల్లు.. అర్చకులకు నెలకు రూ.18 వేల వేతనం
అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్యలకు గల కారణాలను విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యులు లేరు.. అవి ఆత్మహత్యలా, ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ ముగ్గురు చెరువు దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది.. ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడం జరిగిందని ఎస్పీ సింధు శర్మ చెప్పారు.
Read Also: KTR Reacts on Allu Arjun Issue: ఇదంతా గవర్నమెంట్ ప్లాన్.. అల్లు అర్జున్ అంశంపై కేటీఆర్ రియాక్షన్