టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కథ పరంగా బాగున్నా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. దాంతో గోపి చంద్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకేక్కుతున్న భీమా సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..
ఈ సినిమాలో హీరో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనపడబోతున్నాడు. ఇప్పటికే భీమా సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ కూడా సినిమాకు పాజిటివ్ టాక్ ను తీసుకొస్తున్నాయి.. దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది..
ఈ మూవీ మార్చి 8న రిలీజ్ అవుతుండటంతో ప్రస్తుతం మూవీ యూనిట్ ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్స్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా హీరో గోపీచంద్, మూవీ యూనిట్ నేడు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. గోపిచంద్ రావడం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో గుడికి చేరుకున్నారు.. ఆయనతో ఆటోగ్రాఫ్ లు ఫోటోలు దిగారు.. అనంతరం ఆయన గుంటూరులోని RVR, JC ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ను మీట్ అవ్వనున్నారని సమాచారం..
Hero @YoursGopichand visited Goddess Kanaka Durga Temple in Vijayawada and took the divine blessings ✨🙏
He will be visiting the RVR & JC College of Engg, Guntur at 10:30 AM ❤️🔥#BHIMAA IN CINEMAS MARCH 8th💥#BHIMAAonMARCH8th@NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma… pic.twitter.com/yXKjf3w5Fy
— BHIMAA (@BhimaaMovie) February 17, 2024