Today Gold Rate in Hyderabad on 8th May 2024: బంగారం ధరలు ఆకాశాన్నంటిని విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. అయితే గత 3-4 రోజులుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (మే 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.72,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,420గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,270గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,300గా.. 24 క్యారెట్ల ధర రూ.72,330గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,270గా నమోదైంది.
Also Read: DC vs RR: ఐపీఎల్ మ్యాచ్‌లో రాజకీయ నినాదాలు.. 6 మంది అరెస్ట్!
నేడు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి రూ.85,000లుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.85,000 కాగా.. ముంబైలో రూ.85,000గా ఉంది. చెన్నైలో రూ.88,500గా కొనసాగుతుండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.88,500లుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,100గా ఉంది.