Gold Rates Today in Hyderabad: మగువలకు ఇది ‘గోల్డెన్’ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి మారకం, విదేశీ బంగారం నిల్వల ప్రభావంతో గోల్డ్ రేట్స్ నేల చూపులు చూస్తున్నాయి. బుధవారం (జూన్ 26) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి రూ.66,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.230 తగ్గి రూ.72,000 వద్ద కొనసాగుతోంది. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని నిపుణులు అంటున్నారు.
నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,150గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,000గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,600గా.. 24 క్యారెట్ల ధర రూ.72,660గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల ధర రూ.66,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,000గా ఉంది.
Also Read: Gulbadin Naib Acting: ‘ఫేక్ ఇన్‌జూరీ’ డ్రామా.. గుల్బాదిన్ నైబ్‌పై చర్యలు తప్పవా?
నేడు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.90,000గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.90,000గా ఉండగా.. ముంబైలో రూ.90,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.94,500లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.90,950గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో కిలో వెండి ధర రూ.94,500లుగా నమోదైంది.