Kohli-Maxwell: ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ అకౌంట్ బ్లాక్ చేసిన కోహ్లీ..!
- విరాట్ కోహ్లీ.. గ్లెన్ మాక్స్‌వెల్ మంచి ఫ్రెండ్స్
- ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న ఇద్దరు ఆటగాళ్లు
- కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు చెప్పిన మ్యాక్స్‌వెల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడుతున్నారు. అయితే.. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు మ్యాక్స్‌వెల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకు గల కారణమేంటో మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. 2017లో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మాక్స్‌వెల్ కోహ్లీని ఇమిటేట్ చేశాడు. రాంచీ టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ భుజానికి గాయమైంది. ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న మాక్స్‌వెల్ కోహ్లీని ఇమిటేట్ చేశాడు. దీంతో.. అది చూసిన కోహ్లీ మాక్స్‌వెల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడు. అయితే.. అతను ఆర్సీబీలో చేరిన తర్వాత కోహ్లీ సమర్థించాడు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల వేట.. 19 మంది మావోల అరెస్ట్
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
లిస్ట్‌ఎన్‌ఆర్ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ.. తాను ఆర్‌సీబీ జట్టులోకి వస్తున్నానని తెలుసుకుని.. తనకు మెసేజ్ చేసి జట్టులోకి స్వాగతం పలికిన మొదటి వ్యక్తి విరాట్ అని అన్నాడు. ఐపీఎల్‌కు ముందు శిక్షణా శిబిరానికి తాను వచ్చినప్పుడు, ఇద్దరం మాట్లాడుకునే వాళ్లమని చెప్పాడు. అలా మంచి స్నేహితులమయ్యామని మ్యాక్సీ అన్నాడు. విరాట్ పోస్టులు తనకు చూపించేవి కాదని.. ఒకసారి తాను విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి ‘నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశావా..? అని అడిగానని మ్యాక్స్ వెల్ చెప్పాడు. అప్పుడు కోహ్లీ.. అవును చేశాను అన్నాడు. దానికి తాను మంచి పని చేశావ్ నిజంగా నేను నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు అని మ్యాక్స్ వెల్ సారీ చెప్పినట్లు చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీ.. తనను అన్‌బ్లాక్ చేశాడని, తాము మంచి స్నేహితులమయ్యామని మ్యాక్స్ వెల్ పేర్కొన్నాడు.
Read Also: Tejas MK1A: తేజస్ ఇంజిన్ డెలివరీ ఆలస్యం.. అమెరికన్ కంపెనీకి భారత్ భారీ జరిమానా..
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!