Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? నడుస్తుంటే కాలు జారిపడిపోతామేమో అని భయమేస్తోందా? పోనీ సబ్బు వాసన వస్తుందా అంటే.. సీవర్ (చెత్త కాలువ) నుంచి వచ్చే అసహ్యకరమైన దుర్వాసన వేధిస్తోందా? అయితే సమస్య మీరు సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల కాదండోయ్.. మీ బాత్రూమ్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు! చాలామంది ఉదయాన్నే బాత్రూమ్లోకి వెళ్లగానే నేల తడిగా ఉంటే.. ‘నిన్న సరిగ్గా తుడవలేదేమో’ అని తమను తామే తిట్టుకుంటారు. లేదంటే ‘మా బాత్రూమ్ చాలా చిన్నది, అందుకే ఇలా తడిసిపోతోంది’ అని సరిపెట్టుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే.. బాత్రూమ్ ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా వాడే నీళ్లు పడే ప్రదేశం (వెట్ జోన్), పొడిగా ఉండాల్సిన ప్రదేశం (డ్రై జోన్) అని సరిగ్గా విభజించకపోవడమే ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం. దీనికోసం లక్షల రూపాయలు తగలేసి బాత్రూమ్ను మొత్తం పగలగొట్టాల్సిన పనే లేదు. కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ సమస్యకు చాలా సులభంగా చెక్ పెట్టవచ్చు.
ముందుగా మన బాత్రూమ్ను రెండు భాగాలుగా అర్థం చేసుకోవాలి. మనం స్నానం చేసేటప్పుడు నీళ్లు పడే ప్రాంతాన్ని ‘వెట్ జోన్’ అంటారు. అలాగే కమోడ్, వాష్ బేసిన్ ఉండే ప్రాంతాన్ని ‘డ్రై జోన్’ అంటారు. ఈ రెండింటికీ తేడా లేకుండా బాత్రూమ్ నేల అంతా ఒకేలా ఉంటే, స్నానం చేసిన నీళ్లు బాత్రూమ్ అంతా వ్యాపించి ఎప్పుడూ తడి తడిగానే ఉంటుంది. అందుకే స్నానం చేసే చోట (షవర్ ఏరియా) మెరిసే టైల్స్ కాకుండా, కాస్త గరుగ్గా ఉండే ‘యాంటీ-స్కిడ్’ లేదా మ్యాట్ ఫినిష్ టైల్స్ వేయాలి. దీనివల్ల నీళ్లు పడినా కాళ్లు జారవు. అలాగే నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా నేల వాలు (స్లోప్) కరెక్ట్‌గా డ్రెయిన్ హోల్ (నాళం) వైపు ఉండేలా చూసుకోవాలి.
Also Read
- Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
- Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
- Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
- Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
ఇక షవర్ నీళ్లు బాత్రూమ్ అంతా పడకుండా ఉండటానికి మొత్తం గ్లాస్ పార్టిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం షవర్ ఉన్న మూల లేదా గోడ వైపు ఒక 8mm టఫ్ గ్లాస్‌తో సగం స్క్రీన్ వేస్తే సరిపోతుంది. ఇది ఒకవైపు నీటిని బయటకు రాకుండా ఆపుతుంది, మరోవైపు రాకపోకలకు ఖాళీ ప్లేస్ ఇస్తుంది. ఈ గ్లాస్ స్క్రీన్ కింద ఒక 4 అంగుళాల చిన్న గట్టు (కర్వ్) లాంటిది కడితే నీళ్లు అస్సలు బయటకు రావు. రూ.7,000 బడ్జెట్లోనే ఈ పని పూర్తి చేసుకోవచ్చు (ప్రాంతాన్ని బట్టి ధర కాస్త అటుఇటుగా ఉండొచ్చు). సరే, నీళ్లు ఒకే చోట ఆగాయి.. మరి ఆ దుర్వాసన సంగతేంటి అనుకుంటున్నారా? బాత్రూమ్ కడిగిన కాసేపటికే సీవర్ దుర్వాసన వస్తుందంటే, అక్కడ సరిగ్గా వాడని డ్రెయిన్ హోల్ ఉందేమో చూడండి. సాధారణంగా డ్రెయిన్ పైపుల్లో కింద ఉండే నీళ్లు సీవర్ గ్యాస్ పైకి రాకుండా ఆపుతాయి. చాలా రోజులు వాడని డ్రెయిన్లలో ఆ నీళ్లు ఇంకిపోయి, సీవర్ నుంచి నేరుగా చెడు వాసన బయటకు వస్తుంది. అందుకే తరచూ వాడని డ్రెయిన్లలో అప్పుడప్పుడు కాసిన్ని నీళ్లు పోస్తూ ఉండాలి. కొత్త బాత్రూమ్ కట్టేటప్పుడు సరైన ‘ట్రాప్’ వేయడం కూడా చాలా ముఖ్యం.
నీటిని ఆపినంత మాత్రాన తేమ సమస్య పూర్తిగా పోదు. స్నానం చేసినప్పుడు వచ్చే ఆవిరి, తేమ వల్ల అద్దాలపై నీటి చుక్కలు చేరడం, గోడలు తడవటం, తువ్వాళ్లు మెత్తబడిపోవడం జరుగుతుంది. అందుకే ఈ ఆవిరిని బయటకు పంపడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ చాలా అవసరం. ఈ ఫ్యాన్‌ను షవర్ ఏరియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆవిరి ఎక్కువగా అక్కడే తయారవుతుంది. వీలైతే దీనికి ఒక టైమర్ స్విచ్ పెట్టుకుంటే, స్నానం అయ్యాక కొంతసేపటికి అది తనే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. చివరగా, బాత్రూమ్ను సక్రమంగా సర్దుకోవడం కూడా చాలా ముఖ్యం. వాష్ బేసిన్ దగ్గర పేస్ట్‌లు, క్రీమ్‌లు పేర్చడం, నేలపై బకెట్లు, షవర్ కింద షాంపూ సీసాలు పడేస్తే చిన్న బాత్రూమ్ మరింత ఇరుకుగా, కిక్కిరిసినట్లు కనిపిస్తుంది. ప్రతి వస్తువుకూ ఒక స్థానం కేటాయించండి. రోజువారీ వస్తువులను అద్దం వెనుక ఉండే క్యాబినెట్లో, బకెట్లు-సబ్బులను వాష్ బేసిన్ కింద క్యాబినెట్లో, షాంపూలను గోడకు చిన్న సెల్ఫ్ లేదా గోడలోనే చిన్న అల్మారా (రిసెస్డ్ నీచ్) ఏర్పాటు చేసి పెట్టుకోవచ్చు. గుర్తుంచుకోండి.. కేవలం 40 చదరపు అడుగుల చిన్న బాత్రూమ్ కూడా సరిగ్గా ప్లాన్ చేస్తే చాలా శుభ్రంగా, విశాలంగా కనిపిస్తుంది. సమస్య చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా అది పరిశుభ్రతలో లోపం కాకపోవచ్చు.. కేవలం డిజైన్ పొరపాటు కావచ్చు!
తాజావార్తలు
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!