RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RT78: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న క్రేజీ కాంబినేషన్‌కు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడింది. మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో చేయబోతున్నారన్న సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. విలక్షణ కథలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త సినిమా చేయబోతున్నారు. రవితేజ కెరీర్లో 78వ మైలురాయిగా (#RT78) రాబోతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటినుంచో ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ ‘ది బ్రిడ్జ్ ప్రొడక్షన్స్’ అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
లక్ష్మణ్, శ్రీనిరావు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ మార్క్ అన్‌స్టాపబుల్ ఎనర్జీకి.. వివేక్ ఆత్రేయ మార్క్ ఇంటెలిజెంట్, విభిన్న స్క్రీన్‌ప్లే తోడైతే వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందోనని సినీ ప్రియులు లెక్కలు వేసుకుంటున్నారు. రవితేజను పూర్తిగా సరికొత్త అవతారంలో చూపించేలా వివేక్ అదిరిపోయే కథను సిద్ధం చేశారని టాక్. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? కీలక పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు? అనే విషయాలను మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే వీటన్నింటికీ సమాధానం అక్టోబర్ 11న గ్రాండ్‌గా రివీల్ చేయనున్నట్లు యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. టైటిల్ పోస్టర్‌తో పాటే సినిమా జానర్, హీరోయిన్, తారాగణంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ రోజు కోసం మాస్ మహారాజా ఫ్యా్న్స్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Okadu Horror Cinema antadu..
Inkokadu edo antadu..
Inkokadu vachi Inkedo antadu..Inthaki title emayyuntundho – 11th October 10:30AM ki chuddamu 😉
#RT78
M̶a̶s̶s̶ ̶M̶a̶h̶a̶r̶a̶j̶a̶ @RaviTeja_offl #VivekAthreya #Laxman #SriniRao @BridgeProdoffl https://t.co/AQQ7RGsaNs
— Bridge Productions (@BridgeProdoffl) October 9, 2026
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు