Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై రేవంత్ రెడ్డి సమీక్ష
- వ్యవసాయం, సాగునీరు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి
- 235 మండలాల్లో వర్షాభావంపై ప్రభుత్వ ఆందోళన
- కరవు నివారణకు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ కోరిన రాష్ట్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో కురిసిన తక్కువ వర్షపాతం, దాని వల్ల ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 12న సచివాలయంలో మంత్రులతో ఉన్నత స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గి కరవు ఛాయలు అలముకున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు , ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.
అతి ముఖ్యమైన ఐదు అంశాలపై దృష్టి
ఈ ప్రత్యేక సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించనున్నారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్ , కరవు ప్రాంతాల తక్షణ అవసరాలపై ప్రభుత్వం ప్రధానంగా చర్చించనుంది. ఇప్పటికే జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించిన నేపథ్యంలో, ఈ సమీక్షా సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడం , దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంపై యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Also Read
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
కేంద్రాన్ని రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ కోరిన ప్రభుత్వం
రాష్ట్రంలో కరువు మండలాలను అధికారికంగా ప్రకటించడంతో పాటు బాధిత రైతులకు, ప్రాంతాలకు తగినంత ఆర్థిక సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా, కరవు నివారణ చర్యల కోసం రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కోరింది. ఈ నెల 12న జరగబోయే సమావేశంలో వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన తక్షణ సహాయక చర్యలతో పాటు మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు, రైతు సంఘాలు , వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించడంపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు