భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ (GHMC) శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్‌తో ఓటీఎస్ అవకాశం కల్పిస్తుంది. బకాయిదారులకు బల్దియా ఓటీఎస్ అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ ఆఫర్ వర్తించనుంది. 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తి పన్నును చెల్లించే వెసులుబాటు కల్పించనుంది జీహెచ్ఎంసీ. ఓటీఎస్ ద్వారా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
Read Also: Ram Pothineni: రామ్ పోతినేని ఎవరి ‘తాలూకా’నో తెలుసా?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.4 వేల వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ. 1000 కోట్లు గ్రేటర్లోని సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే.. రూ.2,500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్ ఇస్తే రూ.1,150 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. తొలిసారిగా 2020లో ఓటీఎస్‌ను అమలు చేశారు. 2020 నుంచి 2024 మార్చి వరకు మూడుసార్లు ఓటీఎస్ అమలు చేశారు. అందులో రూ.320 కోట్లు రాబట్టింది. అయితే మరోసారి ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నారు. ఈ స్కీమ్ కింద ఆస్తి పన్ను బకాయిదారులు కేవలం 10 శాతం వడ్డీతో పెండింగ్ బకాయిలు చెల్లిస్తే సరిపోతుంది. 2024లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా పెండింగ్ పెట్టిన వారికి ఓటీఎస్ కింద డిస్కౌంట్ ఇచ్చి కనీసం రూ.500 కోట్లు వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.
Read Also: Bhatti Vikramarka: సమగ్ర కుటుంబ సర్వేపై సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ..