Anand Mahindra Counter to BBC: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సుస్థిర స్థానాన్ని సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలిదేశంగా రికార్డులకెక్కింది. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాలను భారత్ ను అభినందిస్తున్నాయి. జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలు కూడా ఇండియాను, ఇస్రోను పొగడ్తలతో ముంచెత్తాయి. అయితే కొన్ని విదేశీ ఛానల్స్ మాత్రం భారత్ పై తమ అక్కస్సును వెళ్లగక్కాయి. పొగినట్లే పొగిడి అదే నోటితో మళ్లీ విమర్శించాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ (బీబీసీ) భారత్ ను విమర్శించింది. తన పేపర్ లో పొగినట్లే పొగిడి తన ఛానల్ లో మాత్రం భారత్ పై తన అసూయను బయటపెట్టింది.
Also Read: Vande Bharat Express: కొత్త వందేభారత్ రైళ్లలో అదిరిపోయే ఫీచర్స్.. విమానంలో లాగా బ్లాక్ బాక్స్ కూడా
మౌలిక సదుపాయలు లేకుండా పేదరికంలో ఉన్న భారత్.. అంతరిక్ష పరిశోధనల కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా? అంటూ ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఘాటుగా స్పందించారు. దశాబ్ధాల వలస పాలనే మా పేదరికానికి కారణమని పేర్కొ్న్నారు. ఒక క్రమ పద్దతిలో భారత ఉపఖండానంతా దోచుకున్నారని మండిపడ్డారు. మా నుంచి కొల్లగొట్టిన అత్యంత విలువైన వస్తువు కోహినూర్ వజ్రం కాదు. మీరు కొల్లగొట్టింది మా ఆత్మాభిమానం, మాపై మాకున్న నమ్మకమని మహీంద్రా అన్నారు. మాకంటే మీరు తక్కువ వారు అని మమల్ని ఒప్పించడం వలస రాజ్యాల లక్ష్యమని ఆయన చెప్పారు. మేం మరుగుదొడ్లలో పెట్టుబడి పెట్టగలం, అంతరిక్షంలో పెట్టుబడి పెట్టగలం. అదేం అంత చేయకూడని పని కాదు సార్ అని మహీంద్రా బీబీసీ యాంకర్ కు చురకలు అంటించారు. చంద్రుని పై అడుగుపెట్టడం భారత ప్రతిష్టను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రగతిని సాధించగలమనే నమ్మకాన్ని ఇస్తుందన్నారు మహీంద్రా. పేదరికం నుంచి మమ్మల్ని మేం డెవలప్ చేసుకోగలం అనే ఆశను చంద్రయాన్ కలిగిస్తుందని ఆనంద్ మహేంద్ర తెలిపారు. ఆశ లేకపోవడమే అత్యంత పేదరికం అని ఆనంద్ మహీంద్రాబీబీసీకి ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీనిపై బీబీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక బీబీసీ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాని తీరును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు.
Really?? The truth is that, in large part, our poverty was a result of decades of colonial rule which systematically plundered the wealth of an entire subcontinent. Yet the most valuable possession we were robbed of was not the Kohinoor Diamond but our pride & belief in our own… https://t.co/KQP40cklQZ
— anand mahindra (@anandmahindra) August 24, 2023