Geetha Madhuri Parenting: ఎన్టీవీ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ గీత మాధురి వివిధ విషయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆమె పిల్లల గురించి కొన్ని విషయాలు చర్చించారు. పిలల్లకు సంబంధించిన అంశంపై గాయని గీతా మాధురి చాలా స్పష్టమైన, లోతైన ఆలోచనతో మాట్లాడింది.
ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.!
గీపిల్లలకు ముందుగా నేర్పాల్సినది డబ్బు, కెరీర్ లేదా మార్కుల కంటే ముందు ఆత్మవిశ్వాసం (Confidence) అని ఆమె అన్నారు. పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన తర్వాత, వాళ్లు ఎవరి మీదా పూర్తిగా ఆధారపడకుండా నిలబడగలగాలన్నదే తన ఆలోచన అని అన్నారు. పిల్లలకు కనీసం మూడు లేదా నాలుగు ఆర్ట్స్ (కళలు) అయినా తప్పకుండా నేర్పించాలని.. అది సంగీతం కావొచ్చు, నృత్యం కావొచ్చు, డ్రాయింగ్ కావొచ్చు లేదా ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ కావొచ్చని అన్నారు. ఈ ఆర్ట్ ఫార్మ్స్ పిల్లల్లో ధైర్యం, ఎమోషనల్ బ్యాలెన్స్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ పెంచుతాయని ఆమె అన్నారు.
Perni Nani: అవకాలు చెవాకులు పేలొద్దు.. జగన్ మాట్లాడితే నోరు తెరుస్తారు..?
ఆర్ట్ అనేది కేవలం టైమ్ పాస్ కాదని.. అది పిల్లల మైండ్‌ను స్ట్రాంగ్ చేస్తుందని, వాళ్లలో ఉన్న భయాలను తగ్గిస్తుంది.. ఒంటరిగా ఉన్నప్పుడైనా తమలో తాము ఉండగల శక్తిని ఇస్తుందన్నారు. భవిష్యత్తులో జీవితంలో ఎలాంటి ఒత్తిడులు వచ్చినా ఆర్ట్ వాళ్లకు ఒక సపోర్ట్ సిస్టమ్‌లా పనిచేస్తుందని ఆమె అన్నారు.