Geetha Madhuri and Nandu Welcome Baby Boy: టాలీవుడ్ సింగర్ గీతా మాధురి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఫిబ్రవరి 10న తనకు కుమారుడు పుట్టాడని శనివారం (ఫిబ్రవరి 17) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గీతా మాధురి పేర్కొన్నారు. విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్�
Geetha Madhuri: టాలీవుడ్ సింగర్ గీతామాధురి.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది. ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అన్న విషయాన్నీ అధికారికంగా అభిమానులకు తెలిపింది. చిరుత సినిమాలో చమ్కా.. చమ్కా .. చమ్కీరే సాంగ్ తో ఫేమస్ అయిన గీతామాధురి.. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
Geetha Madhuri: సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసే సింగర్ ఎవరు అంటే టక్కున గీతా గుర్తొచ్చేస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె వాయిస్ కు ఫిదా అవ్వని వారుండరు.
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు.... ' గీతాన్ని రాసిన పెన్నును చంద్రబోస్... తెలుగు ఇండియన్ ఐడల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సింగర్ కు అందచేశారు. ఈ వీకెండ్ లో చంద్రబోస్ గీతాలను కంటెస్టెంట్స్ పాడి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ లోని కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలతో వీక్షకులను అలరించారు. ఎస్పీ చరణ్ తో పాటు 'దసరా'తో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న నాని సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. మొదటి వారం యుతి పోటీ నుండి తప్పుకోగా రెండోవారం మానస బయటకు వెళ్ళిపోయింది. బాబా సెహగల్ పాల్గొన్న ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లోని 12మంది కంటెస్టెంట్స్ ను నందమూరి బాలకృష్ణ ర్యాప్ సాంగ్ పాడి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆ పన్నెండు మందితో కలిసి బాలయ్య బాబు స్టెప్పులేని ఆకట్టుకున్నారు. దీంతో ఈ సీజన్ కు సరికొత్త జోష్ యాడ్ అయ్యింది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కు ఆహా శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాడు సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. గత సీజన్ లో అదృష్టాన్ని మిస్ చేసుకున్న సాకేత్ ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లోనే గోల్డెన్ మైక్ సొంతం చేసుకుని టాప్ 12లో చోటు దక్కించుకున్నాడు.