సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి కస్తూర్బా కాలేజీలోని సైన్స్ ల్యాబ్‌లో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో.. 10 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురికావడంతో.., ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. మారేడ్‌పల్లిలోని కస్తూర్బా కాలేజీలోని ఇంటర్ బ్లాక్‌లో గల కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థినులు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో విష వాయువులు లీక్ కావడంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై.. 10 మంది విద్యార్థినులు స్పృహ కోల్పోయారు.
Also Read : Amit Shah: టెర్రరిస్ట్‌ను రక్షించడం అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానం
అయితే.. దీంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై వెంటనే బాధిత విద్యార్థినులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దీంతో.. కళాశాలలోని విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు కళాశాలకు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు వైద్యులు.
Also Read : Facebook New Updates : ఫేస్ బుక్ యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాలి.. మీ ప్రొఫైల్ మారుతోంది