Facebook New Updates : ఫేస్ బుక్ సంస్థ డిసెంబర్ 1నుంచి కొన్ని కీలకమార్పులను తీసుకురాబోతుంది. యూజర్ల ఖాతాలకు సంబంధించి కొన్నింటిని తీసేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ప్రకటన జారీ చేసింది. యూజర్ల ప్రొఫైల్ నుంచి వారి లింగ ప్రాధాన్యత, మతపరమైన అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు, చిరునామాను ఫేస్ బుక్ తొలగించనుంది. గతంలో ఫేస్ బుక్ ఖాతాను కొత్తగా తెరిచే క్రమంలో వినియోగదారుల మతపరమైన అభిప్రాయాలు, రాజకీయాలకు సంబంధించి తమ అభిప్రాయాలు, వారి లైంగిక అభిరుచులతో కూడిన పూర్తి వివరాలను అడిగేది. దీంతో యూజర్లు ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేషన్ లో భాగంగా చాలా సమయం వెచ్చించి ఆ వివరాలన్నీ నింపేవారు. ప్రస్తుతం ఈ ప్రొఫైల్ కు సంబంధించి యూజర్లకు ఫేస్ బుక్ నోటిఫికేషన్లను పంపిస్తోంది. ఈ విధమైన సమాచారాన్ని వారి ప్రొఫైల్ నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫీల్డ్ లను (ఆయా వివరాలు) నింపిన వారికి నోటిఫికేషన్లు పంపిస్తున్నట్టు ఫేస్ బుక్ సంస్థ ప్రకటించింది. అంతమాత్రాన యూజర్లు ఫేస్ బుక్ వేదికగా ఈ సమాచారం పంచుకోవడంపై ప్రభావం పడదు’’ అంటూ ఈ మెయిల్ నోటిఫికేషన్ లో మెటా పేర్కొంది.
Read Also: National Conference: ఫరూక్ అబ్దుల్లా సంచలన నిర్ణయం.. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి రాజీనామా
Read Also: జారుతున్న జాకెట్తో జాహ్నవి అందాల విందు