తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఓ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో ఉన్న తన్విత ఆయుర్వేదిక్ అనే సంస్థ వారు తమ సంస్థలో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే వాటితో ఆయుర్వేదిక్ వస్తువులు తయారుచేసి విక్రయించి, ప్రతి నెల లక్షకు 8…