ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు. Also Read:MLAs Defection Case:…
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లే సమయంలో పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌లోని జాతీయ రహదారి 34లోని ఘటల్ గ్రామం సమీపంలో, రాజస్థాన్‌లోని కాస్‌గంజ్ నుంచి గోగామెడికి వెళ్తున్న గోగాజీ భక్తులతో బయలుదేరిన ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 8 మంది మరణించగా, 43 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 60 మంది భక్తులు ఉన్నారని బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. Also Read: Saudi hero: ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు…
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారిగా సమాచారం.
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Road Accident : పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జలంధర్‌లోని పఠాన్‌కోట్ చౌక్ సమీపంలో రెడ్ లైట్ వద్ద ఆగి ఉన్న సుమారు 10 వాహనాలను అదుపుతప్పి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ ఢీకొట్టింది.
Road Accident : రాజ్‌కోట్ నుంచి గుజరాత్‌లోని బల్‌రాంపూర్ జిల్లాకు వెళ్తున్న హైస్పీడ్ డబుల్ డెక్కర్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కు బియ్యం లోడ్ తో వస్తోంది.
అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తు ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా.. ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.