చిట్టీల పేరిట 5 కోట్లకు టోకరా వేసిన విశ్రాంత ఏఎస్సై, అతని కుమారుడిని కఠినంగా శిక్షించాలని… బాధితులు హైదరాబాద్ సీసీస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. చిట్టీల పేరిట తమ నుంచి 5 కోట్లు కాజేసి పరారైన… తండ్రీ, కొడుకులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండు నెలల క్రితం అరెస్టు చేశారని బాధితులు తెలిపారు. పాతబస్తీ ఉప్పుగూడలోని శివసాయినగర్ లో నివాసముండే మచెల్మె తులసీదాస్ (60) విశ్రాంత ఏఎస్పై కుమారుడు మచెల్మె కార్తీక్ కుమార్… కుటుం బీకులతో కలిసి 30 ఏళ్లుగా ఓం గణేశ్ పేరిట అక్రమంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చిట్టీలో సభ్యులుగా చేరితే 50వేల చిట్టీకి 61 వేలు, లక్ష చిట్టీకి 1.23 లక్షలు, 3లక్షల చిట్టీకి 3.72 లక్షలు, 4.5లక్షల చిట్టీకి 5.58లక్షలు తిరిగి చెల్లిస్తామని చెప్పారని… బాధితులు తెలిపారు.
Also Read : Bandi Sanjay : పువ్వు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ బాక్సును బద్దలు చేయండి
వారి మాటలు నమ్మిన 130 మంది డబ్బులు జమ చేశారని… ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తండ్రీకొడుకులతో పాటు కుటుంబీకులు చిట్టీ డబ్బులు సుమారు 5 కోట్లు తీసుకుని పారి పోయారని తెలిపారు. తాము సీసీఎస్ ను ఆశ్రయించగా… పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న తులసీదాస్, క్రాంతికుమార్ ను సీసీఎస్ పోలీసులు రెండు నెలల క్రితం అరెస్టు చేశారని బాధితులు తెలిపారు. జైలు నుంచి వచ్చిన ఆ ఇద్దరు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని… తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే కోర్టులో చూసుకోవాలని చెపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారాలు చేసుకొని ఎంతో కష్టార్జితంతో చిట్టి డబ్బులు కట్టామని… తమ డబ్బులు తమకు ఇప్పించాలని సీసీస్ పోలీసులను బాధితులు వేడుకున్నారు.