ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) భారీ విజయంతో బోణి కొట్టింది. సీజన్ 18లో భాగంగా ఆదివారం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‍లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చెలరేగాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 30 రన్స్ చేశాడు. నితీశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉప్పల్ స్టేడియం అభిమానుల కేరింతలతో ఊగిపోయింది. అయితే ఈ మ్యాచ్‍లో ఓ ఆసక్తకర సంఘటన చోటు చేసుకుంది. తాను లవ్ మ్యారేజ్ చేసుకోనని నితీశ్ స్పష్టం చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో నితీశ్ రెడ్డి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేశాడు. హైదరాబాద్‌లో మ్యాచ్ కాబట్టి ఫాన్స్ అందరూ తెలుగువాళ్లే ఉంటారు. నితీష్ తెలుగోడు అవ్వడంతో.. బౌండరీని ఆనుకుని ఉన్న గ్యాలరీలో ఉన్న యూత్ కాసేపు అతనితో మాట్లాడారు. ప్ అభిమాని ‘బ్రో.. మ్యారేజ్ ఎప్పుడు’ అంటూ గట్టిగా అరిచాడు. ‘అమ్మాయిలు సచ్చిపోతున్నారురా అయ్యా’ అని మరో అభిమాని అన్నాడు. ‘బ్రో.. లవ్ మ్యారేజా’ అని ఒకరు గట్టిగా అరవగా.. నితీశ్ రెడ్డి లోలోపల సిగ్గుపడుతూ నాక్కున్నాడు. అదే సమయంలో కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి సైగలు చేశాడు. నితీష్ రిప్లయ్ ఇవ్వడంతో అభిమానులు గట్టిగా కేకేలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నితీశ్ రెడ్డి ఐపీఎల్ 2023లో అడుగుపెట్టాడు. ఆ ఏడాది రెండు మ్యాచ్‌లే ఆడిన నితీష్ రెడ్డికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2024లో వచ్చిన మొదటి అవకాశంనే సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాట్, బాల్‌తో రాణించి కీలక ఆటగాడిగా మారాడు. గతేడాది 13 మ్యాచ్‌లలో 303 పరుగులు, 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అతడికి భారత టీ20లలో ఆడే అవకాశం వచ్చింది. అనంతరం టెస్టుల్లో కూడా అకాశం వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ 2025లో సత్తాచాటి.. భారత జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని చుస్తున్నాడు.
Bro Marriage eppudu bro 😭😂#NitishKumarReddy pic.twitter.com/pUmbDM44Ez
— Movies4u Official (@Movies4u_Officl) March 24, 2025