పండగవేళ తమ సంతోషాలను స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకునే వారికి బిగ్ షాక్. స్వీట్స్ ఎంతో టేస్టీగా ఉన్నాయని లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 45 షాపుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. స్వీట్స్ తయారీ లో విచ్చలవిడిగా…
డబ్బు మాయలో పడి ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ముఖ్యంగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విశాఖ నగరంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పూర్ణమార్కెట్ ఏరియాలో నకిలీ నెయ్యి తయారీ డెన్స్ గుర్తించారు. ముఠా లాడ్జి లలో రూమ్స్…
వీకెండ్ లో లేదా ఫెస్టివల్స్ సందర్భాల్లో ఫ్రెండ్స్ తో కలిసి.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హోటల్స్ లో డిన్నర్ చేసేందుకు వెళ్తుంటారు. ఇలా మీరు కూడా వెళ్తున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని చేజేతులా చిక్కుల్లో పడేసుకున్నట్లే. ఇటీవల పలువురు కస్టమర్లు తాము ఆర్డర్ పెట్టుకున్న ఆహారపదార్థాలు పాడైపోవడం, బొద్దింకలు కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు మండి రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ…
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకులు తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యితో కొందరు దుకాణదార్లు పూతరేకులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించడం సంచలనంగా మారింది. దాడుల్లో ఎటువంటి బ్రాండ్ లేని 160 కేజీల కల్తీ నెయ్యి సీజ్ చేసి ఎనిమిది షాపులపై కేసులు నమోదు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూతరేకు స్వీట్ లో కొందరు అధిక లాభాల కోసం కల్తీ నెయ్యిని కలుపుతున్నట్లుగా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో…
Hyderabad: హైదరాబాద్‌లోని ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్‌స్టాప్ దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు..
హైదరాబాద్‌లో పలుచోట్ల హోటల్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. నగరంలో ఫుడ్ కల్తీ ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, అమీర్ పేట్‌లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్‌తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్‌లోని యూనివర్సల్ ఆల్ మాతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా కాటేదాన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న తయారీ సంస్థపై దాడులు చేశారు. సింతటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. SKR, ఉమాని సంస్థల్లో అక్రమంగా నిల్వ చేసిన 1400 కేజీల కల్తీ…
Sundeep Kishan Hotel: గత కొద్ది నెలల నుండి తెలుగు రాష్ట్రాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రముఖ రెస్టారెంట్లు, చిన్న హోటలలో తనిఖీలు చేయడం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే తాజాగా హీరో సందీప్ కిషన్ పార్ట్నర్ గా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ లలో హోటల్లో నాసరికం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలోని హాస్టల్స్, హోటల్స్, ఫుడ్…