Flipkart Big Diwali Sale 2024 Dates Announced: ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌కు సిద్ధమైంది. దసరా 2024 సందర్భంగా ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. దీపావళికి ‘బిగ్ దీపావళి’ సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి బిగ్ దీపావళి సేల్ మొదలవుతుందని వెబ్‌సైట్‌లో ఓ పోస్టర్ పంచుకుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఎంపిక చేసిన కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
దీపావళి సేల్ 2024లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సేల్‌లో భాగంగా అందిస్తున్న కొన్ని ఆఫర్లను వెబ్‌సైట్‌లో రివీల్ చేసింది. ఐఫోన్ 15 రూ.49,999కే లభించనుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.69,900గా ఉంది. 9 శాతం తగ్గింపు అనంతరం రూ.62,999కు అందుబాటులో ఉంది. సేల్ సమయంలో 13 వేల వరకు తగ్గనుంది. బ్యాంకు ఆఫర్స్ అదనంగా ఉన్నాయి.
Also Read: Rohit Sharma: ఐపీఎల్ 2025లో ఏ టీమ్‌కు ఆడుతావ్.. అభిమాని ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇదే! (వీడియో)
దీపావళి సేల్ 2024లో యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను రూ.9,999 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చు. యాపిల్ మ్యాక్స్ బుక్ ఎయిర్ ఎం2పై రాయితీ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే ఎంత వరకు డిస్కౌంట్ అనేది వెల్లడించలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23ను రూ.37,999కి.. గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈను రూ.29,249కి కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. త్వరలో మరిన్ని డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేయనుంది.