Rohit Sharma: ఐపీఎల్ 2025లో ఏ టీమ్‌కు ఆడుతావ్.. అభిమాని ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇదే! (వీడియో)
- న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు
- ఏ టీమ్‌కు ఆడుతావ్ భాయ్
- ముంబై రిటైన్ లిస్టులో హిట్‌మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React To Fan Question, Which IPL Team To Play: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ సేన.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 344/3 స్కోరు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (125), రిషబ్ పంత్ (53) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 12 పరుగులు వెనుకంజలో ఉంది. లంచ్ బ్రేక్‌కు ముందు వర్షం రావడంతో చాలా సమయం ఆట నిలిచిపోగా.. ఇప్పుడే ఆరంభమైంది.
చిన్నస్వామి స్టేడియంలో వర్షం తగ్గిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి వెళ్లి పిచ్‌ను పరిశీలించాడు. తిరిగి డగౌట్‌కు వస్తుండగా.. స్టాండ్స్‌లోని ఫాన్స్ ‘రోహిత్.. రోహిత్’ అంటూ అరిచారు. వారికి హిట్‌మ్యాన్ హయ్ చెప్పాడు. ‘ఐపీఎల్ 2025లో ఏ టీమ్‌కు ఆడుతావ్ భాయ్’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘నీకు ఏ టీమ్ కావాలి’ అని రోహిత్ సరదాగా అడిగాడు. అందుకు ఆ ఫ్యాన్ బదులిస్తూ.. ‘ఆర్సీబీకి వచ్చేయ్ భాయ్, లవ్ యూ భాయ్’ అని అన్నాడు. ఇంతలో రోహిత్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read: IND vs PAK: నేడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్ తెలుగబ్బాయే! ఫుల్ డీటెయిల్స్ ఇవే
ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంతో.. రోహిత్ శర్మ సహా అభిమానులకు మింగుడుపడలేదు. ఐపీఎల్ సమయంలోనే హార్దిక్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు రోహిత్ మెగా వేలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వేలంలో రోహిత్‌ను కొనుగోలు చేయాలని బెంగళూరును ఇటీవల మాజీ భారత బ్యాటర్ మహ్మద్ కైఫ్ కోరారు. పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింతా కూడా రోహిత్ కోసం భారీగా ఖర్చు చేస్తా అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబై రిటైన్ లిస్టులో హిట్‌మ్యాన్ ఉన్నాడని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
Fan: “Which team in the IPL”
Rohit Sharma replied “Where do you want”
Fan: “Come to RCB”
Typical Rohit Sharma 😄👌 pic.twitter.com/A4XHZF8A3p
— Johns. (@CricCrazyJohns) October 19, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!