హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం నాలుగో అంతస్తులోని ఉర్ధూ అకాడమీ కార్యాలయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటగా దట్టమైన పొగలు వచ్చాయి. సాయంత్రం ఆఫీస్ సమయం పూర్తి అవడంతో కార్యాలయానికి తాళాలు వేసి సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయం నుంచి మంటలు చెలరేగడంతో హజ్ హౌస్ సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మిగితా 11 అంతస్తులకు వ్యాపించకుండా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Also Read : Instagram Cheating: బంపర్ ఆఫర్.. మూడు రోజుల్లో మూడు రెట్ల వడ్డీ
ఉర్దు అకాడమీ కార్యాలయంలోని ఫర్నిచర్, దస్తావేజులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమయానికి కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ ఘాతం వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు వక్స్ బోర్డు ఛైర్మన్ మసి ఉల్లా ఖాన్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారు ఏకే ఖనా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Shama Sikander: స్విమ్ సూట్ వేసి.. ఎవరికోసం అమ్మడు ఎదురుచూపులు
ఇదిలా ఉండగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గుడపెట్ లో గత జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాయలంలో ఎవరూ లేకపోవడంతో మలేరియా విభాగానికి చెందిన ప్రత్యేక వార్డ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో మలేరియా పిచికారికి ఉపయోగించే కిట్లు, మందులు, యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.