ఏపీలో జనసేన-బీజేపీ మైత్రి కొనసాగాలంటే బీజేపీ అధిష్టానం స్పందించాల్సిందే. ఈ రెండు పార్టీలు 2014లో లాగా కలిసి పోటీచేయాలని భావిస్తున్నాయి. మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. జనసేనతో మైత్రి కొనసాగాలంటే జాతీయ నాయకత్వం జోక్యం అవసరం అన్నారు. రాష్ట్ర స్థాయిలో పవన్ తో సమన్వయం చేయడంలో గ్యాప్ కనిపిస్తోందన్నారు విష్ణుకుమార్ రాజు. తిరుపతి ఎన్నికల తర్వాత ఉమ్మడిగా పోరాడిన దాఖలాలు లేవన్నారు. వైసీపీని గద్దె దించడమే ఉమ్మడి లక్ష్యమని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారన్నారు.
Read Also: PaniPuri : ఈ విషయం తెలిస్తే పానీ పూరి బండి దగ్గరకు పరిగెత్తాల్సిందే
బీజేపీ నుంచి ఆయన కోరుకున్న రోడ్ మ్యాప్ కూడా అదే. మిత్రపక్షంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడంలో నాయకత్వం ఎక్కువ సంప్రదింపులు చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పని చేయవలసిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. మూడు పార్టీలు కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు…. నా అభిప్రాయం కూడా అదే అన్నారు. మొత్తం మీద ఏపీలో మళ్ళీ రాజకీయ పొత్తులపై ఆసక్తికర చర్చలకు అవకాశం ఏర్పడింది. ఈ పొత్తులపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also:Viral : ఫాలోవర్స్ కోసం డబ్బుల వర్షం.. అంతా ఆ వెబ్ సిరీస్ వల్లే..!