Married Men: వివాహం అనేది పవిత్రమైన బంధం. అర్థాంగిగా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ అమ్మాయి కష్ట సుఖాల్లో మీకు తోడూనీడై ఉంటుంది. కార్యేషు దాసి, కరణేసు మంత్రి, భోజ్యేసు మాత, శ్రయనేషు రంభలా మీకు సకల సేవలు చేస్తుంది. అమ్మాయి, అబ్బాయి మధ్య మంచి సక్యత ఉంటే జీవితం సుఖంగా కొనసాగుతుంది. దంపతుల మధ్య ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం, ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి. ఇందులో ఏదైనా తక్కువ ఉంటే మీ బంధం దెబ్బతింటుంది. అందుకే భార్యాభర్తలు తమ బంధాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కొన్ని విషయాలు పాటించాలి. ముఖ్యంగా పురుషులు.
Read also: Telangana Cabinet: కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. వివిధ అంశాలపై చర్చ
ఏది ఏమైనా భార్యలు కష్టాలు పడుతుంటే భర్తలకు మాత్రం వెన్నుదన్నుగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని చేయి వదలొద్దు. వారు చెప్పేది వినండి. వారు కోరుకున్నది చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం కాదు ఆదుకోవాలి. తను కలత చెందితే కంటికి రెప్పలా చూడండి. ఇది ఎలా ఉండాలంటే మీ ఓదార్పుతో తను ఆ బాధనే మరిచిపోయేలా ఉండాలి. మీరు మీ భాగస్వామిని మార్చడానికి ప్రయత్నిస్తే, అది కొన్ని రోజుల తర్వాత వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుందేమో ఇక్కసారి ఆలోచించండి. దీని వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి, వారికి అలానే ఉండనివ్వండి. అది తప్పు అనుకున్నప్పుడు ఇద్దరు ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకోండి. చెప్పడానికి ట్రై చేయండి. ఒప్పించండి.. మార్పు మంచిదే కానీ.. అతిగా మార్పు కోరుకోవడం అవివేకమని గ్రహించండి. మీరు ప్రాణంగా ఎదుటి వారిని ప్రేమిస్తున్నారని తెలిస్తే.. మారతాడని గుర్తుంచుకోండి. సంతోషకరమైన వివాహ సంబంధాన్ని కలిగి ఉండటానికి, ఆమె సంతోషంగా ఉన్నారని నిర్ధారించుకోండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వారి ఆనందం కూడా ముఖ్యం.
Read also: Harish Rao: రైతుబీమా తరహాలోనే కార్మిక బీమా.. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు
వీలయినంత వరకు వారిని నవ్వించడానికి ప్రయత్నించండి. ఆమెకు ఏమి కావాలో తెలుసుకోని సంతోషపెట్టే వాటిని చేయండి. మొదట్లో సర్ ప్రైజ్ లు ఇస్తూ జనాన్ని సంతోషపెట్టే మగ మహారాజులు చాలా మంది రోజులు గడుస్తున్న కొద్దీ దాన్ని మర్చిపోతారు. కానీ, అలా చేయకండి. ఏ వయస్సులోనైనా మీ భాగస్వామిని ఆకర్షించడం సంతోషపెట్టడం ముఖ్యమని గుర్తు పెట్టుకోండి. కాబట్టి, ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో, అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న గిప్ట్ ఇచ్చి, తనిని గెలిపించడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించండమే కాదండోయ్ డబ్బును కూడా ఆదా చేయడం అందులో ఒక ముఖ్యమైన భాగమే కానీ భార్య విషయంలో అలా కాదు. మనసుకు నచ్చిన వస్తువు కొనుక్కుని తన కళ్లలో ఆనందం చూస్తుంటే ఎంత డబ్బు వెచ్చించినా రాదని గుర్తుంచుకోండి. కాబట్టి తనకు ఇష్టపడేదాన్ని కొననివ్వండి. మీరు ఆనందంగా ఉండండి మీ భాగస్వామిని కూడా హ్యాపీగా చూసుకోండి. కాబట్టి ఇలా మనం చేసే పనులతో ఎదుటివారికి మనకు ఎలాంటి ఇబ్బంది కలుగనంత వరకు జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
Telangana Rains: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..