Telangana Cabinet: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించింన సంగతి తెలిసిందే. దాదాపు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నారు. సాగు పనులు, భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపైనా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై చర్చించే అవకాశం ఉంది. వాగులు మరియు వంకల వరదల కారణంగా రోడ్లు మరియు రవాణా మార్గాలకు నష్టం అంచనా వేయబడుతుంది.
Read also: Harish Rao: రైతుబీమా తరహాలోనే కార్మిక బీమా.. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు
యుద్ధప్రాతిపదికన రహదారులను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పాతబస్తీలో త్వరలో మెట్రో రైలు పనులు పూర్తి చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు క్యాబినెట్‌లో మెట్రో రైలు పొడిగింపుపై చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. గృహలక్ష్మి పథకం అమలుతో పాటు బీసీ, మైనారిటీ బందుల అమలుపైనా చర్చ జరగనుంది. మరి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Home Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో అస్సలు పెంచకూడదు.. డబ్బు రాకను అడ్డుకుంటాయి!