మహబూబాబాద్ జిల్లాలో మరిపెడలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణకు శాపంగా మారిందని ఆయన మండిపడ్డారు. రైతుబంధు ఇచ్చే ప్రభుత్వం.. దేశంలోనే ఒక తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన ఉద్ఘాటించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు లాభం జరిగింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను లెక్కలోకి తీసుకోమని, మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీనే వస్తుందన్నారు. దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి నేను బాధ్యత తీసుకుంటా అని ఆయన అన్నారు.
Also Read : Corona Spray : ఒక్కసారి పీల్చితే .. మీరు రమ్మన్నా కరోనా రాదు
ఈనెల 18న ఖమ్మం సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే అన్ని నియోజకవర్గాలకు సాగు నీరు అందుతోందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు వల్ల రైతులు లాభపడుతున్నారన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించే సభ ఎంతో ప్రత్యేకమైనదని, ఈ సభకు 5 లక్షల జనసమీకరణ చేయనున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు.
Also Read : Mir Barket Ali Khan : అధికారిక లాంఛనాలతో ముకర్రమ్ ఝా అంత్యక్రియలు