In AI Fashion Show Different Countries Presidents: ప్రతి నిత్యం ఎన్నో విషయాలపై చర్చలు జరిపే దేశాధినేతలు బిజీబిజీగా జీవితాన్ని గడిపేస్తుంటారు. అలాంటి దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు వేసుకొని ఫ్యాషన్ షో లో ఉండే ర్యాంప్ పై వాకింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి..? దేశాధినేతల ర్యాంప్ వాక్ చేయడం ఏంటి అని భావిస్తున్నారా..? అయితే అది నిజం కాకపోవచ్చు.. కాకపోతే., ప్రస్తుతం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి చేసిన వీడియోలో వివిధ దేశాలకు చెందిన దేశాధినేతలు ర్యాంప్ వాక్ చేసినట్లుగా కనపడుతుంది. ఈ వీడియోను తాజాగా ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో..
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరక్ ఒబామా, రష్యా అధినేత పుతిన్ ఇలా అనేక దేశాల నేతలను రకరకాల దుస్తులను వేసుకొని ర్యాంపు పై వాక్ చేస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన వీడియోను ఎలన్ మస్క్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోకి మస్క్ ఇది ” ఏఐ ఫ్యాషన్ షో సమయం ” అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియో 40 మిలియన్స్ కు పైగా వ్యూస్ ని పొందింది.
Vitamin Deficiency: మీ చర్మం పొరబాడిపోతుందా.? అయితే ఆ లోపం అయ్యిండొచ్చు..
ఈ వీడియోలో అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులు లతోపాటు ప్రముఖ వ్యక్తులు ర్యాంపు పై నడుస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ వీడియోలో వివిధ దేశాల నేతలు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ, ఇలాన్ మస్క్, కమలా హారిస్, బరాక్ ఒబామా, పోప్ హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, ఫ్రాన్సిస్, టిమ్ కుక్, ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, నాన్సీ పెలోసి, జి జిన్‌పింగ్, జస్టిన్ ట్రూడో, బిల్, బెర్నీ సాండర్స్, బిల్ గేట్స్ లు కనబడతారు. ఇక చివర్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కూడా వీడియోలో జత చేసి చివరికి తాజాగా జరిగిన మైక్రోసాఫ్ట్ ఉదంతాన్ని కూడా జోడించి చమత్కారంగా ఇందులో ప్రస్తావించారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk) July 22, 2024