గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయ్యాడు. నివేదికల ప్రకారం.. అన్మోల్‌ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ అధికారులు కొంతకాలం క్రితం అన్మోల్ తమ దేశంలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో.. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతని అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన వారాల తర్వాత కాలిఫోర్నియా పోలీసులు అన్మోల్‌ను అరెస్టు చేశారు.
తమిళనాడు పోలీసులు ఆరుగురు రష్యా పౌరులను అరెస్ట్ చేశారు. కుడంకుళం వద్ద ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ దగ్గర నుంచి ఆరుగురు రష్యన్ పౌరులు, ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. న్యూక్లియర్ రియాక్టర్ పరిసరాల్లో విదేశీయులు ఉన్నారని స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో సోమవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు IANSకి తెలిపారు.
మెట్రలో రైలులో ఓ పెద్దాయన రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. ఆడ పిల్లలపై ప్రతాపం చూపించాడు. మెట్రో రైలు అంటేనే రద్దీగా ఉంటుంది. పైగా ఎవరి స్థానాలు వారికి ఉంటాయి. లేడీస్ సీట్లు, వృద్ధుల సీట్లు వేర్వేరుగా ఉంటాయి.
రష్యాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ గ్రూపునకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను పుతిన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ ముగింపు ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంలో కొందరు విద్యార్థులను, కొన్ని విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
అమ్మాలపై అఘాయిత్యాలు జరకుండా అధికారులు ఎన్నో పకడ్బంది చర్యలు చేపట్టిని ఎక్కడో ఒక చోటు వారి పై అత్యాచారాలు, లైంగికదాడులు జరుగుతూనే వున్నాయి. కానీ ఓ మాజీ మంత్రి కూడా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో.. అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ.. విద్యార్ధిని పై లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులో…