PM-Kisan: దేశంలోని రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 పెట్టుబడి సాయంగా అందిస్తుంది. దీన్ని మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.
Rythu Bharosa : రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా, ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది.…
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై మాట్లాడారు. ఆయన రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతూ.. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా, రాష్ట్ర ఆర్థిక…
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని లో ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలకు కోటీ ఇరవై లక్షల మంది ఉచిత బస్ టికెట్స్ తో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు.…
DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా…
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ ను ప్రత్యేక అధికారి గా నియమించింది.
నోటికి వచ్చినట్లు మాట్లాడటం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు అని, హామీలు అమలు చేయమని అడిగితే నోటికి వచ్చినట్లు సీఎం తిడుతున్నారన్నారు. కేసీఆర్ పధకాలను రేవంత్ రెడ్డి కొనసాగించడం లేదని, రెండు పంటలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, రైతులకు రైతుబంధు రాలేదన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని హరీష్ రావు మండిపడ్డారు.