Duddilla Sridhar Babu : మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి చర్యలకు దిగలేదని, బీఆర్‌ఎస్ వినకుండా ఉంటే.. మేము న్యాయపరంగా వెళ్లే వారమని, పరిశ్రమలు ప్రగతికి ముఖ్యమన్నా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు మేము ఇలాగే చేస్తే… అభివృద్ధి జరిగేదా..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. వైఫల్యాలపై కూడా సమీక్ష చేస్తామని, ఇంటలిజెన్స్.. లా అండ్ ఆర్డర్ వైఫల్యాల మీద కూడా సమీక్ష ఉంటదన్నారు శ్రీధర్ బాబు. లోపాలు అంటే చర్యలు ఉంటాయని, సవరణ చేస్తామని, ఇకపై చిన్న లోపం జరిగినా.. దాడులకు పాల్పడ్డ తీవ్రంగా పరిగణిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ ఎందుకు ఢిల్లీకి పోతుంటారు అనేది అందరికీ తెలుసు అని, వారి బాధల నుండి బయట పడే పనిలో ఉన్నారు కేటీఆర్ అని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
Home Loan: జీతం స్లిప్, ఐటిఆర్ లేకుండా కూడా బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయని తెలుసా?
బట్ట కాల్చి మీద వేసే పనిలో ఉన్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అని, బీజేపీ .. అన్ని రాష్ట్రాలకు డబ్బులు పంపే ఏటీఎం లాగా ఉందా..? బీఆర్‌ఎస్ .. పక్క రాష్ట్రాల కి డబ్బులు పంపలేదా..? అని ఆయన అన్నారు. అవి కూడా బయటకు వస్తాయని, బీఆర్‌ఎస్.. బీజేపీ ఇద్దరు ఒకటే లైన్ అని, ఉదయం బీఆర్‌ఎస్.. మధ్యాహ్నం బీజేపీ అదే మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ నీ ఎదుర్కోలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా..’అందుకే ఇద్దరు ఒక్కటయ్యారు.. జనం ఏం బాధ పడటం లేదు.. నా ప్రభుత్వం లేదనే బాధ లో కేసీఆర్ ఉన్నాడు.. 50 వేల ఉద్యోగాలు ఇవ్వడం తప్పా.. ఉచిత బస్సు తప్పా.. 18 వేల కోట్ల పై చిలుకు రుణాలు మాఫీ చేయడం తప్పా.. రాళ్ళు వేసింది ఎవరు.. పిచ్చొళ్లు ఎవరు అనేది విచారణలో తేలుతుంది.. రాళ్ళు ఎవరి చేతులకు ఇస్తున్నారు మీరు.. అధికారులను కొట్టే వరకు వెళ్లి..హరీష్ మాటలు తగదు’అని శ్రీధర్ బాబు అన్నారు.
CS Shanti Kumari : ప్రభుత్వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొననున్న 14,000 మంది పాఠశాల విద్యార్థులు