Off The Record: శత్రువులు ఎక్కడో ఉండర్రా…. కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్ సినిమా డైలాగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పదేపదే గుర్తుకు వస్తోందట. ఎంత సర్దుకుపోదామన్నా…. చెల్లెలు కవిత అస్సలు వదిలిపెట్టం లేదని ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. కవిత తాజాగా అన్నను డైరెక్ట్‌గా అటాక్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. పైగా… ఏ విషయంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందో… అదే…
MP Laxman: రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణకు సమాధానం చెప్పు.. కుట్రలు, పన్నగాలకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా ధర్నాచౌక్‌లో బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు.. అమలు చేయక పోవడమే, వంచించడమే మీ గ్యారంటీ హా? అని ప్రశ్నించారు. ప్రజల్ని తప్పు దోవ…
Dana Nagender: రాజీనామాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా అంశాన్ని సీఎం నిర్ణయంతో ముడిపెట్టాడు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయమని వెనకాడనన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుతుందని గుర్తు చేశారు. "సుప్రీంకోర్టులో అప్పీల్ చేశా.. కేసు కోర్టులో పెండింగ్ ఉంది.. స్పీకర్ దగ్గర కూడా అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది.. సందర్భాన్ని బట్టి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా.. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే…
Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. రక్త సంబంధీకులే పోటీ పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు పోటీగా నిలిచారు. సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు. బుధవారం గడువు…
Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్‌ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తేడా కొట్టినట్టు పార్టీ పోస్ట్‌మార్టంలో తేలింది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లోకల్ నాయకులు ఏమని రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు బాగా హర్ట్ అయ్యారన్నది నిజమేనా? అసలు స్థానిక నేతల ఆవేదన ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్… సీరియస్ పోస్ట్‌మార్టంలో పడిందట. అసలు గెలుస్తామని, లేదంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతామని భావించిన భావించిన పార్టీ పెద్దలు… కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజార్టీ రావడాన్ని అస్సలు…
Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. నిన్న(శనివారం) ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసీఆర్ మళ్లీ పార్టీలోకి పిలుస్తే వెళతారా..? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. "కేసీఆర్ తండ్రిగా పిలిస్తే తప్పకుండా వెళతాను.. రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పోను.. ఏ పార్టీలోకి నేను ఎందుకు పోతాను.. ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకురాలిని.. బీఆర్ఎస్ నుంచి గెంటి వేయబడ్డ నాయకురాలిగా..…
KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్‌ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం "ఆహా నా పెళ్ళంట సినిమా కథ" లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం…