పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు యూరప్‌కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నైరుతి మౌరిటానియాలోని ఎన్‌డియాగోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ తీరంలో పడవ బోల్తా పడింది.
తునీషియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సబ్-సహారా ఆఫ్రికా నుంచి 29 మంది వలసదారులు మధ్యధరా సముద్రం దాటి ఇటలీకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వారి రెండు పడవలు ట్యునీషియా తీరంలో మునిగిపోవడంతో మరణించినట్లు ట్యునీషియా తీర రక్షక దళం ఆదివారం తెలిపింది.