పేరుకే రిసార్ట్…!! అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా !! టూరిస్ట్‌ల పాలిట మృత్యుకుహరం ! లేక్ వ్యూ రిసార్ట్ కాదు… లేక్‌లోనే కట్టిన రిసార్ట్ ! ఇరిగేషన్ భూములను అక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణం… అనుమతుల్లేకుండా బోటింగ్ నిర్వహించి ఇద్దరు టూరిస్ట్‌ల ప్రాణాలు బలిగొంది ఆ రిసార్ట్ ! ఈ ఘటనతో వికారాబాద్‌లోని వైల్డర్‌నెస్ రిసార్ట్ బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీకెండ్ కదా అని సరదాగా గడిపేందుకు వెళ్తే… ఇద్దరి ప్రాణం బలిగొంది ఆ రిసార్ట్. అనంతగిరి…
Mumbai: మహారాష్ట్రలోని అలిబాగ్ సముద్ర తీరానికి సమీపంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ బోటులో 18 నుండి 20 మంది మత్స్యకారులు ఉన్నారని సమాచారం. అయితే, అందులోని మత్స్యకారులందరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. నేడు ఉదయం అలిబాగ్ సమీప సముద్రంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.…
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిముడి వద్ద పడవ ప్రమాదం జరిగింది. వరద ప్రభావిత లంక గ్రామాలకు పడవలో వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో పడవలో ఆరుగురు ప్రయాణిస్తుండగా వరద ప్రవాహానికి పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురిని స్థానిక మత్స్యకారులు నాటు పడవలో వెళ్లి రక్షించగా.. ఒకరు గల్లంతు అయ్యారు.
తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నది దాటుతుండగా బోటు బోల్తా పడడంతో 20 మంది మృతి చెందారు. ఘటన సంబంధిత వివరాల్లోకెళితే.. మహ్మంద్ దార్ ప్రాంతంలో నది దాటుతుండగా ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదంలో పడవలోని వారందరూ మునిగిపోయారని నంగరార్ ప్రావిన్స్‌కు చెందిన ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. Cyber Crime: 9 కోట్లు…
Boat Capsize: పశ్చిమాఫ్రికాలోని కేప్ వెర్డేలో పడవ మునిగిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఇక్కడి ద్వీప సమూహం తీరానికి సమీపంలో వలసదారుల పడవ సముద్రంలో మునిగి 60 మందికి పైగా మరణించారు.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి పారిపోతున్న రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ ఈ వారం సముద్రంలో మునిగిపోవడం వల్ల దాదాపు 17 మంది మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని మునిగిపోయారని అధికారులు గురువారం తెలిపారు.
గ్రీస్ పడవ విషాదంలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను పాకిస్తాన్ అరెస్టు చేసింది. గ్రీస్ తీరంలో మునిగిపోయిన ఒక పడవలో సుమారు 300 మంది పాకిస్తానీ పౌరులు మరణించినట్టు పాకిస్తాన్ ప్రకటించింది.