71 Dead in Afghanistan Bus Accident: అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 17 మంది చిన్నారులతో సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ప్రావిన్స్ అధికారులు బుధవారం ఎక్స్‌లో ధృవీకరించారు. ట్రక్కు, మోటార్ సైకిల్‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు. Also Read: Horoscope Today: బుధవారం…
Libiya : లిబియాలో 2011 నుండి 14 సంవత్సరాలు గడిచినా శాంతి స్థాపన జరగడం లేదు. ఆగ్నేయ, పశ్చిమ లిబియాలోని రెండు ప్రదేశాలలో కనీసం 29 మంది వలసదారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా డైరెక్టరేట్, లిబియా రెడ్ క్రెసెంట్ గురువారం తెలిపాయి.
Boat Sink ఉత్తర ఫ్రాన్స్ తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 13 మంది వలసదారులు మరణించారు. ఓ బోటులో 50 మందికి పైగా ఉన్న ఇంగ్లీష్ ఛానల్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవానం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని వెల్లడించారు.
Boat Sink: అంతర్యుద్ధాలు, తీవ్రవాదం, హింస నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటూ ప్రతీ ఏడాది కొన్ని వేల మంది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారు సముద్రంలో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా మరోసారి లిబియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. లిబియా మధ్యదరా సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది.
ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్‌పై పాకిస్థాన్ ఇప్పుడు ఎదురుదాడికి తెరతీసింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు నవంబర్ 1లోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
యెమెన్ గుండా గల్ఫ్ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఇథియోపియన్ వలసదారులపై సౌదీ సరిహద్దు గార్డులు పేలుడు ఆయుధాలు ప్రయోగించారని, గత సంవత్సరం నుంచి వందల మందిని చంపారని హ్యూమన్ రైట్స్ వాచ్ సోమవారం తెలిపింది.
తునీషియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సబ్-సహారా ఆఫ్రికా నుంచి 29 మంది వలసదారులు మధ్యధరా సముద్రం దాటి ఇటలీకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వారి రెండు పడవలు ట్యునీషియా తీరంలో మునిగిపోవడంతో మరణించినట్లు ట్యునీషియా తీర రక్షక దళం ఆదివారం తెలిపింది.