Bandi Sanjay: పాకిస్థాన్ పై ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ లోని టవర్ సర్కిల్ నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ర్యాాలీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించడం సంతోషకరమని అన్నారు. దేశభక్తులు, క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మ్యాచ్ చూసారన్నారు. ఇంతటి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం సంతోషమని.. ఈ విజయంతో దేశం అంతా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కొంతమంది మూర్ఖులు పాకిస్తాన్ ఓడిందని బాధపడుతున్నారని.. గతంలో కొందరు కరీంనగర్ లో ఇలాగే చేస్తే వీపులు సాఫ్ చేశామన్నారు. అలాగే కొందరు షాపింగ్ మాల్స్ పేరుతో హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. లవ్ జిహాద్ పేరుతో ప్రత్యేక శిక్షణ పొంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండా ప్రదర్శించిన షాపింగ్ మాల్ మూసివేయాలన్నారు.
Read Also: Revanth Reddy: రెండు నెలలు ఓపిక పట్టండి.. నిరుద్యోగులకు రేవంత్ భరోసా
ప్రవళిక మరణం తరువాత తల్లిదండ్రులు క్షోభ పడ్డారని బండి సంజయ్ అన్నారు. పోలీసుల తప్పుడు ప్రకటన తర్వాత అంతకంటే ఎక్కువగా క్షోభ పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతను తప్పించుకునేందుకు మానవత్వం లేని మానవ మృగాల మాదిరిగా చనిపోయిన అమ్మాయి మరణాన్ని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. యువత కోసం కొట్లాడి జైల్ కి పోయిన మీ అన్న గా చెబుతున్నా.. ఊర్లకు వెళ్ళండి ప్రభుత్వ మోసాన్ని చెప్పండని తెలిపారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. యూనివర్సిటీలను, కోచింగ్ సెంటర్లను వీడండి.. 50 లక్షల మంది తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూలడం ఖాయమని తెలిపారు. నిజాయితీ ఉన్నవాళ్లు సీబీఐ విచారణ కోరాలి… సిట్ విచారణతో ఏమి జరగదని పేర్కొన్నారు. పేపర్ లీక్ చేసిన వాళ్ళు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు.. నిరుద్యోగులు చనిపోతున్నారని బండి సంజయ్ అన్నారు.
Read Also: IND vs PAK: పాకిస్తాన్పై భారత్ ఘన విజయం.. ఇండియా ఆల్రౌండ్ షో