భారతదేశంలో కొంతమంది సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారాన్ని చిటికెలో కనిపెడతారు. సమస్య పెద్దదా లేక చిన్నదా అని తేడా లేకుండా పరిష్కారం కోసం అవసరానికి తగ్గట్టు సమస్య నుంచి బయటపడతారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను చూస్తే మనకి మతిపోక తప్పదు. ఇక వీడియో విషయానికి వస్తే.. వర్షంలో వెళ్తున్న సమయంలో ఆ కార్ వైపర్స్ పాడైపోయాయి. అయితే ఆ సమయంలో కార్లో ఉన్న దంపతులు కనుగొన్న పరిష్కారం చూస్తే మాత్రం నిజంగా వారి తెలివికి జోహార్ చెప్పాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోను గమనిస్తే భార్యాభర్తలు కారులో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు. అయితే దారిలో అనుకోకుండా వర్షం కురవడం మొదలయింది. కాకపోతే దురదృష్టం కొద్దీ అదే సమయానికి కారు వైపర్స్ చెడిపోయాయి. వర్షం పడుతున్న సమయంలో కారు వైపర్స్ లేకుండా ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి విపిత్కర పరిస్థితుల్లో కూడా ఆ జంట అందరికి మతిపోయే ప్లాన్ వేసింది. కారులో ప్రయాణం చేస్తున్న మహిళ రెండు వైపర్ లకు ఓ రెండు పొడవాటి తాళ్లను రెండు వైపుల కట్టింది. ఆ తాళ్లను తన చేతులతో అటూ ఇటూ లాగుతోంది. దీంతో ఆ వైపర్లు కూడా సునాయాసంగా అటూ ఇటూ కదులుతూ కారు అద్దాన్ని శుభ్రం చేస్తున్నాయి. దింతో వారి ప్రయాణం సుగుమంగా ముందుకు సాగింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు రెండు లక్షల మందికి పైగా కూడా ఈ వీడియోకి లైక్ లు వచ్చాయి. ఇక వీడియో పై నెటిజన్లు వారి శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ వ్యక్తి.. కారు వైపర్లు బాగు చేయించడానికి బదులు.. తన భార్యను కారులో ఇన్‌స్టాల్ చేశాడు., అనగా.., మరొకరైతే., మీకు అలాంటి భార్య ఉండడం ఎంత అదృష్టమో, తనకి మిమ్మల్ని పొగడడానికి మాటలు చాలడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.